తెలుగు
రాష్ట్రాల్లో గణేశుడి శోభాయాత్రలు వైభవంగా జరుగుతున్నాయి. లడ్డూ వేలంపాటలతో తెలుగు
లోగిళ్ళలో కోలాహలం నెలకొనగా , సాంస్కృతిక కార్యక్రమాలతో గణేశ్ మండపాల వద్ద సందడి వాతావరణం చోటుచేసుకుంది. పల్లెలు, పట్టణాల్లో రంగరంగ వైభవంగా గౌరీ పుత్రుడికి
వీడ్కోలు పలుకుతున్నారు. నదులు, కాలువలు, ఇతర ప్రవాహాల వద్ద నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
గణపతి బప్పా మోరియా
నినాదాలతో తెలుగు రాష్ట్రాలు
మార్మోగుతున్నాయి.
భాగ్యనగరంలో
వినాయకుడి నవరాత్రులు కనులపండువగా కొనసాగాయి. ఖైరతాబాద్ శ్రీదశ మహా విద్యా గణపతి, గంగమ్మ
ఒడికి చేరారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర సందర్భంగా భాగ్యనగరం
వీధులు భక్తులతో కిక్కిరిసాయి.
ఉదయం
6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్
భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. క్రేన్
నంబర్ 4 వద్ద చివరి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి
అయింది.
ఎప్పుడూ చివరిసారి జరిగే ఖైరతాబాద్ మహావినాయకుడిని ఈ సారి ముందుగానే
నిమజ్జనం చేశారు.
బాలాపూర్
గణపతి శోభాయాత్ర కూడా హుస్సేన్ సాగర్ వైపు సాగుతోంది. స్వామి వారి లడ్డూను
వేలంపాటలో తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానందరెడ్డి సొంతం చేసుకున్నారు. వేలంలో
36 మంది పాల్గొనగా దయానందరెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు.
బండ్లగూడ జాగీరులో వినాయకస్వామి చేతిలోని లడ్డూ
వేలంలో రికార్డు ధర పలికింది. కీర్తీ రిచ్మండ్ విల్లాస్ లో జరిగిన వేలంలో
విఘ్నాధిపతి లడ్డూ రూ.1.26 కోట్లు పలికింది.