అమెరికా సందర్శించే భారతీయుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. 2023లో ఇప్పటికే భారతీయులకు పది లక్షల వీసాలు జారీ చేసినట్టు అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. 2019తో పోల్చుకుంటే ఇప్పటికే 20 శాతం ఎక్కువ వీసాలు జారీ చేశారు. గత ఏడాది 12 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు ప్రకటించారు. ఇది భారత్ అమెరికా బంధాలను మరింత బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
అమెరికా సందర్శించే వారిలో భారతీయుల సంఖ్య పది శాతంగా ఉంది. అమెరికా విద్యార్ధులకు జారీ చేసే వీసాల్లో 20 శాతం, హెచ్ఎల్ వీసాల్లో 65 శాతం భారతీయులకే జారీ చేస్తోంది. భారత్ అమెరికా ద్త్వౌపాక్షిక సంబంధాలను ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తుందని ఢిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో మన బంధం మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని వీసాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. రంజు సింగ్ అతని భార్యకు పది లక్షల వీసాను జారీ చేసి ఎరిక్ గార్సెట్టి అందించారు. ఈ దంపతులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి కుమారుడి వద్దకు వెళుతున్నట్లు చెప్పారు.
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీసా జారీ ప్రక్రియను సరళతరం చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన వెల్లడించారు. దేశంలోని అనేక నగరాల్లో వీసాలు జారీ చేసేందుకు మా సిబ్బంది స్మార్ట్‌గా కష్టపడటం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. ఇది ఒక దేశానికి మరొక దేశానికి సంబంధించినది కాదని రెండు దేశాల ప్రజల మధ్య నెలకొన్న బంధాలను తెలియజేస్తోందన్నారు. 2023లో పది లక్షల వీసాలు జారీ చేసిన సందర్భంగా ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పది లక్షల వీసాలు జారీ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇది ఇంతటితో ఆగదని, అమెరికాను దర్శించాలనుకుంటున్న భారతీయులకు మరిన్ని వీసాలు జారీ చేస్తామంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
గతంలో కన్నా భారత్ అమెరికా బంధం మరింత బలపడిందని గార్సెట్టి అన్నారు. చదువుకోవడానికి, పనిచేయడానికి, పర్యాటకానికి, వ్యాపారానికి అమెరికా వెళ్లేవారు రెండు దేశాల సంబంధాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడులు పెట్టేవారికి చాలా త్వరగా వీసాలు జారీ చేస్తామని ప్రకటించారు.