నైపుణ్యాభివృద్ధి
కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించేలా సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. టీడీపీ నేత ముల్లా ఖాజా హుస్సేన్ ను నంద్యాల
పోలీసులు అరెస్టు చేశారు. ముల్లా ఖాజా హుస్సేన్ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
కృష్ణా
జిల్లాకు చెందిన టీడీపీ నేత బుర్రా వెంకట్‌ను కూడా కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్
బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన
న్యాయమూర్తిని అవమానించేలా పోస్టులు పెట్టాడని ఇతనిపై అభియోగం ఉంది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్
విధించిన జడ్జితో పాటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయమూర్తికి
వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జడ్జిలపై అనుచిత పోస్టులు,
ట్రోలింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం, హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్
వేసింది. కొందరు కావాలనే అనుచిత పోస్టులు చేశారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
కోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు చేసిన 26 మంది అకౌంట్లు పరిశీలించి
నోటీసులు జారీ చేయాలని డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతకు
ముందు రాష్ట్రపతి భవన్ కూడా ఈ అంశంపై స్పందించింది. తమకు అందిన ఫిర్యాదును ఏపీ సీఎస్
కు పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.