వుషు
క్రీడాకారిణీ రోషిబినాదేవి నవోరెమ్ మాతృభూమిపై ప్రేమను చాటుకున్నారు.ఆసియా క్రీడల్లో
గెలుచుకున్న రజత పతకాన్ని మణిపూర్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆసియా
క్రీడల్లో భాగంగా వుషు 60 కేజీల విభాగంలో రోషిబినాదేవి రజత పతకాన్ని కైవసం
చేసుకున్నారు. ఫైనల్ లో చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమితో స్వర్ణాన్ని
చేజార్చుకున్నారు.
2018లో జకర్తాలో జరిగిన క్రీడల్లో రోషిబినాదేవి, కాంస్య
పతకాన్ని గెలిచారు.
‘‘రజతం
దక్కడం సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, స్వర్ణ పతకాన్ని గెలవలేనందుకు బాధగా ఉంది.
ఆటలో పైచేయి సాధించేందుకు శక్తి
వంచనలేకుండా ప్రయత్నించా, నాకు దక్కిన రజతాన్ని మణిపూర్ ప్రజలకు అంకితమిస్తున్నా.
ఆటలోని తప్పులను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
నవంబర్ లో జరిగే ప్రపంచస్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు మరింత కఠినంగా శ్రమిస్తా‘‘
అని తెలిపారు.
రోషిబినాదేవికి
అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ… ఆమె క్రమశిక్షణ, అంకితభావం ప్రశంసనీయమన్నారు. రోషిబినాదేవి
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు క్రీడలమంత్రి అనూరాగ్ ఠాకూర్ . మహిళల
విభాగంలో విజయం సాధించి దేశానికి పేరుతెచ్చారని కొనియాడారు.
2016 లో జూనియర్ విభాగంలో మొదటిసారి అంతర్జాతీయ
పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. ఈ ఏడాది మాస్కో జరిగిన వుషు స్టార్ ఛాంపియన్షిప్
లో స్వర్ణం గెలిచారు. 2018 ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా జూనియర్ వుషు పోటీల్లో
కాంస్య పతకాలు సాధించి దేశానికి పేరు తెచ్చారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్