భాగ్యనగరంలో గణేశ్ లడ్డూ లక్షల్లో పలకడం మనం వింటూనే ఉంటాం. అయితే ఈ ఏడాది బండ్లగూడ జాగీర్‌లో లంబోదరుడి చేతిలోని లడ్డూకు రికార్డు ధర దక్కింది. బండ్లగూడ రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది. విల్లా కమ్యూనిటీలోని అందరూ కలసి ఈ లడ్డూను దక్కించుకున్నారు.
మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో గణేశుని లడ్డు రూ.25.50 లక్షల ధర పలికింది. నల్గొండ పట్టణంలో పాతబస్తీలో వినాయకుడి లడ్డూ రూ.36 లక్షలకు వేలం పాడారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీ పడి ధర పెంచుకుంటూ పోయారు. చివరకు కాంగ్రెస్ నేత జయరాజ్ రూ.36 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 వేల సీసీ కెమెరాలు, అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. 40 వేల మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వేలం ప్రక్రియ పూర్తి కాగానే గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కానున్నాయి.