రాష్ట్రవ్యాప్తంగా
నేటి నుంచి మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల చిన్నపాటి జల్లులు పడతాయని వాతావరణ
శాఖ తెలిపింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే
సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది.
సెప్టెంబర్
30న మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వానలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు
కూడా సంభవిస్తాయని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కూడా రాష్ట్రంలో వానలు పడే
సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
కనిష్ట
ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు అవుతుందని
వెల్లడించారు.
తెలంగాణలో
కూడా ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలిపింది. ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని
పేర్కొంది.
హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. ఉదయం అంతా
నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రానికి భారీ వాన కురిసింది. దీంతో రోడ్లు
అన్నీ జలమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కల్గింది.