ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పురుషుల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఇవాళ మరో స్వర్ణం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జిత్ సింగ్, శివ నార్వల్, అర్జున్ సింగ్ చీమా బృందం గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో షూటింగ్ విభాగంలోనే భారత్‌కు 4 బంగారు పతకాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత క్రీడాకారులు మొత్తం ఆరు బంగారు పతకాలు సాధించారు. షూటింగ్ విభాగంలోనే భారత క్రీడాకారులు ఇప్పటి వరకు 13 పతకాలు సాధించారు.
వ్యక్తిగత విభాగంలో సరబ్జిత్ సింగ్ ఐదో స్థానం, అర్జున్ సింగ్ 8వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శివ నార్వాల్ మాత్రం ఫైనల్స్‌కు చేరలేకపోయారు. ఆయన 14వ స్థానంలో నిలిచారు. 10 మీటర్లు ఎయిల్ పిస్టల్ విభాగంలో పురుషుల జట్టు చైనా కన్నా ఒక పాయింట్ ఎక్కువ సాధించి స్వర్ణం సాధించింది. భారత క్రీడాకారుల జట్టు 1734 పాయింట్లు సాధించగా, చైనా జట్టు 1733 పాయింట్లు సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్