ఆసీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన చివరి మూడో వన్డేలో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 96 పరుగులు, స్మిత్ 61 బంతుల్లో 74, లబుషేన్ 58 బంతుల్లో 72, వార్నర్
34 బంతుల్లో 56 పరుగులతో చెలరేగడంతో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.
353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 286 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57 బంతుల్లో 81 పరుగులు, కోహ్లి 61 బంతుల్లో 56,
శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 48 పరుగులతో రాణించారు. మాక్స్వెల్ 40 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. స్పిన్‌తో భారత ఆటగాళ్లను కట్టడి చేశారు. మ్యాక్స్‌వెల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. తొలి రెండు మ్యాచ్‌లలో నెగ్గడంతో ఈ సిరీస్ 2-1తో భారత్ కౌవసం చేసుకుంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్