ఆసియా
గేమ్స్ లో నేడు జరిగిన పోటీల్లో భారత్
ఆటగాళ్ళు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది పతకాలు సాధించారు.
షూటర్లు ఏడు పతకాలు గెలవగా, సెయిలింగ్ విభాగంలో భారత్ ఓ మెడల్ సాధించింది. దీంతో
భారత్ సాధించిన మెడల్స్ సంఖ్య 22కు పెరిగింది.
ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు,
10 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది.
షూటింగ్
లో మూడు బంగారు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలను మన షూటర్లు తమ ఖాతాలో
వేసుకున్నారు.
ఆసియా
గేమ్స్ కు ఆతిథ్యమిస్తున్న చైనా 131 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా తర్వాతి
స్థానంలో కొరియా, జపాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
మహిళల
50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ పతకం
గెలుచుకుంది.
మహిళల 25 మీటర్ల జట్టు విభాగంలో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్
సంగ్వాన్ టీమ్, గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్
టీమ్ విభాగంలో ఆషి చౌష్కీ, మానిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాల జట్టు రజతం సొంతం
చేసుకుంది.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత
విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం సాధించగా, పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో
అంగద్, గుర్జోత్, అనంత్‌జీత్ సింగ్ కాంస్యం గెలిచారు. పురుషుల దింగ్ ఐఎల్సీఏ 7
విభాగంలో విష్ణు శరవణన్ కాంస్యం సాధించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్