స్కిల్
స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు
అక్టోబర్ 4కు వాయిదా వేసింది. చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇస్తే దర్యాప్తు
పూర్తి చేస్తామని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. గత
కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు
దాటవేశారన్నారు.
కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్రకోణం బయటపెడతామన్నారు. విచారణను అక్టోబర్ 5 వరకు వాయిదా
వేయాలనుకున్నట్లు న్యాయమూర్తి చెప్పగా కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని
ఏఏజీ పొన్నవోలు అభ్యర్థించారు.
విచారణ
వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం
చేశారు.
బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదని
వివరణ అడిగారు. ఎంతకాలం పిటిషన్ పెండింగ్ లో ఉంచాలని ప్రశ్నించారు. లిఖిత పూర్వక
మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల
నాలుగున విచారణ చేస్తామని, అదే రోజు ఇరు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని
న్యాయమూర్తి ఆదేశించారు. మరోసారి వాదనలు వాయిదా వేయవద్దని చంద్రబాబు లాయర్లకు
సూచించారు.
అమరావతి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో భాగంగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబుకు
ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ వాదించింది. కేసును ఈ నెల29, శుక్రవారం
మధ్యాహ్నానికి కోర్టు వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్
కేసులో A14గా ఉన్న లోకేశ్, హైకోర్టులో ముందస్తు
బెయిల్ పిటిషన్ వేశారు.