మలయాళంలో
భారీ విజయం సాధించిన 2018 సినిమా భారత్ నుంచి ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు
ఎంట్రీగా అధికారికంగా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం
ఈ సినిమా పోటీపడనుంది. కేరళలో వరదలు నేపథ్యంగా సాగే ఈ సినిమా ఘనవిజయం సాధించి భారీ
స్థాయిలో వసూళ్ళు రాబట్టింది.
జూడ్
ఆంథోని జోసఫ్ ధర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టోవినో థామస్, కుంచకో బోబన్,
అసిఫ్ అలీ, వినీతా శ్రీనివాసన్, నారాయణ్, లాల్ ప్రధానపాత్రదారులు. ఈ ఏడాది మే లో
విడుదలైన 2018 సినిమా, అత్యధిక వసూళ్ళు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డులు
నెలకొల్పింది. భారీగా లాభాలు ఆర్జించిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమాకు చోటు
దక్కింది.
2018 కేరళ వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆద్యంతం భావోద్వేగ
భరితంగా తెరకెక్కించారు.
పర్యావరణ
మార్పులు నేపథ్యంలో నిర్మించిన 2018 మూవీ ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించిందని
ఫిల్మ్ మేకర్ గిరీశ్ కాసరవల్లి తెలిపారు.
ది
కేరళ స్టోరీ, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ, మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, తెలుగు
మూవీ బలగం, మరాఠీ సినిమాలు వాల్వి, బాప్లోక్, తమిళ చిత్రం ఆగస్టు 16, 1947 సహా 22
సినిమాలను ఆస్కార్ ఎంట్రీ కోసం పరిశీలించారు.
ఉత్తమ
అంతర్జాతీయ చలనచిత్రం విభాగంలో ఈ మూవీ అవార్డు కోసం పోటీ పడనుంది. గతంలో ఈ విభాగం
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంగా ఉండేది.
2002లో
లగాన్ తర్వాత మరే భారతీయ సినిమా, ఉత్తమ విదేశీ చిత్రం విభాగం పోటీల్లో తుది వరకు
నిలబడలేదు. మదర్ ఇండియా, సలామ్ బొంబే
గతంలో పోటీపడ్డాయి.
త్రిబుల్
ఆర్ మూవీ ఈ ఏడాది రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ
ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో గుజరాతీ సినిమా ఛెల్లో షో ను
పంపగా అర్హత సాధించలేకపోయింది.
గాంధీ
చిత్రానికి గాను కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతేయ మొదటి సారి ఆస్కార్ అవార్డు
గెలుచుకున్నారు. 1992లో దర్శకుడు సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారం
అందుకున్నారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ మూడు అవార్డులు గెలుచుకుంది. అయితే
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతీయ చలనచిత్రాలు ఇప్పటి వరకు అవార్డు
దక్కించుకోలేకపోయాయి.