Ganesh Chaturdhi : కరాచీలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు
పాకిస్తాన్లో హిందూ దేవాలయాల కూల్చి వేతలు, హిందువులపై దాడుల గురించి అనేక వార్తలు వినే ఉంటారు. అయితే తాజాగా పాకిస్తాన్లోని కరాచీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.అవును మీరు చదివింది నిజమే. పాకిస్తాన్లో మహారాష్ట్రీయులు 1500 మంది దాకా నివశిస్తున్నారు. కరాచీలో మహారాష్ట్రీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సమీపంలోని శ్రీ రత్నేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొంటున్నారు.
మండపాల్లో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పూజలు నిర్వహించారు. చివరి రోజు గడ్వాల్ నృత్యాలు చేసుకుంటూ, గణేష్ మహరాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేసుకుంటూ నిమజ్జనం కార్యక్రమాలను పూర్తి చేశారు. పాకిస్తాన్లో హిందువులపై, దేవాలయాలపై తరచూ దాడులు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహంచడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినా పాక్ ప్రజల వైఖరిలో మార్పును ఇది స్పష్టం చేస్తోంది.