వైబ్రెంట్
గుజరాత్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో ఏర్పాటు చేసిన రోబో ఎగ్జిబిషన్‌ను
సందర్శించిన అనంతరం ఈ సదస్సును ప్రధాని
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి
భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులు,
విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ సందర్శించారు.
గుజరాత్
పర్యటనలో భాగంగా ప్రధాని, రూ.5,206 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించి
జాతికి అంకితం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని
22 జిల్లాల వ్యాప్తంగా వైఫై సేవలు
ప్రారంభించే పనులు, పాఠశాలల అభివృద్ధి కోసం రూ. 4,505 కోట్లతో చేపట్టిన పనులు కూడా
ప్రారంభిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పర్యటనలో
భాగంగా దహోద్‌లో రూ. 23 కోట్లతో
నిర్మించిన నవోదయ విద్యాలయం, పది కోట్ల రూపాయలతో నిర్మించిన ఎఫ్ఎమ్ రేడియో స్టూడియోను
ప్రారంభిస్తారు. రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన పనులతో పాటు భూగర్భ జలాల పంపిణీ
పనుల ప్రారంభోత్సవంలో కూడా ప్రధాని పాల్గొంటారు.