కెనడా
పార్లమెంట్ స్పీకర్ తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో
నాజీల తరఫున పోరాడిన ఓ వృద్ధుడిని ప్రశంసించిన కొన్ని రోజులకు ఆయన స్పీకర్ పదవిని
వీడాల్సి వచ్చింది.
గత
వారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కెనడా పార్లమెంట్ ను
సందర్శించినప్పుడు తన జిల్లాలోని ఉక్రెయిన్ వలసదారుడి గురించి స్పీకర్ ఆంథోనీ రోటా
ప్రస్తావించారు. అయితే సదరు వృద్ధుడు నాజీ
అనుబంధ మిలటరీలో పనిచేసే వార్తలు బయటకు రావడంతో రోటా ఇరకాటంలో పడ్డారు. అప్పటి
నుంచి అతడి రాజీనామా కోసం ఒత్తిడి పెరిగింది. స్వపక్ష, విపక్ష సభ్యులు ముక్తకంఠంతో
రాజీనామా డిమాండ్ చేశారు.
‘‘అత్యంత
బరువెక్కిన హృదయంతో తన రాజీనామా సమాచారాన్ని చట్ట సభ్యులకు వివరిస్తున్నా’’ అని అంథోని
రోటా ప్రకటించారు.
తాను
చేసిన పొరపాటు వ్యాఖ్యలతో యూదుల మనోభావాలు దెబ్బతినడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం
చేస్తునట్లు తెలిపారు.
ఉక్రెయిన్
వలసదారుడైన 98 ఏళ్ళ యరోస్లేవ్ హుంకా, స్పీకర్ ఆంధోని రోటా ప్రాతినిధ్యం వహిస్తున్న
ప్రాంతానికి చెందిన ఓటరుగా ఉన్నారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు పార్లమెంట్‌ను
సందర్శించినప్పుడు, రోటా ఆ వృద్ధుడిని ప్రశంసించారు.
రెండో
ప్రపంచయుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్-కెనడా యుద్ధవీరుడు కృషి చేశాడని
కొనియాడారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం పోరాడారని తెలిపారు. ఉక్రెయిన్-కెనడా
హీరో అంటూ కితాబిచ్చారు.
కానీ
హుంకా, 14వ వాఫెన్ గ్రెనేడియర్ డివిజన్ లో పనిచేశారు.
అతను నాజీలు చేసిన ఊచకోతలో పాల్గొన్నారు.
ఆంథోనీ
రోటా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు అతడు స్పీకర్ పదవిని
విడనాడాలని డిమాండ్ చేశారు.
2004లో
మొట్టమొదటసారిగా పార్లమెంటుకు ఎన్నికైన రోటా, 2019లో స్పీకర్ గా ఎన్నికయ్యారు.
ఆంథోనీ
రోటా వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ కెనడా ప్రధాని
జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.