ఆసియన్ గేమ్స్‌లో భారత్ కొత్త రికార్డు ఇది. ఈక్వెస్ట్రియన్ పోటీలో టీమ్ డ్రెసేజ్ ఈవెంట్లో 209.205 పాయింట్ల భారీ స్కోరు సాధించి స్వర్ణ పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. అనూష్ అగర్వాలా, హృదయ్ విపుల్ ఛెడ్డా, దివ్యకృతి, సుదీప్తి హాజెలాలతో కూడిన భారత జట్టు రికార్డు ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో ఈ ఈవెంట్లో భారతదేశానికి ఇది మొట్టమొదటి స్వర్ణ పతకం. అంతేకాదు, ఈక్వెస్ట్రియన్ పోటీల్లో 41 సంవత్సరాల తర్వాత భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
సుమారు 10 గంటల పాటు సాగిన ఈ పోటీలో ఆసియాలోని అన్ని ప్రధాన దేశాల అథ్లెట్లూ పాల్గొన్నారు. అయితే అనూష్, హృదయ్, దివ్యకృతి, సుదీప్తి బృందం పైచేయి సాధించింది.
అనూష్, అతని గుర్రం ఎట్రో 71.088 పాయింట్లు సాధించారు. హృదయ్, అతని గుర్రం ఎమరాల్డ్ 69.941 పాయింట్లు సాధించారు. దివ్యకృతి, ఆమె గుర్రం అడ్రినలిన్ 68.176 పాయింట్లు సాధించారు. సుదీప్తి, ఆమె గుర్రం చిన్స్కీ 66.706 పాయింట్లు సాధించారు. భారత జట్టు 209.205 పాయింట్లతో పోటీలో అగ్రస్థానంలో నిలిచింది. క్రీడాకారులు సాధించిన మొత్తం పాయింట్లను కలిపి చూస్తే, భారత జట్టు దరిదాపుల్లో కూడా ఎవరూ నిలవలేదు.
ఆతిథ్య దేశం చైనా 204.882 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. నిజానికి ఈ పోటీలో చైనా లేదా జపాన్ గెలుస్తాయని అందరూ అంచనా వేసారు. కానీ అనూహ్యంగా భారత్ ఆ దేశాలను వెనక్కు నెట్టి అద్భుతమైన విజయం సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్