ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌ను దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరించింది.ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు వహీదా ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.భారతీయ సినీ పరిశ్రమకు వహీదా ఐదు దశాబ్దాల సేవలు అందించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
వహీదా రెహమాన్ ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. 1955లో వచ్చిన రోజులు మారాయి చిత్రంలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలోని ఏరువాక సాగారో రన్నో అన్న పాట బహుళ ప్రాచుర్యం పొందింది. 1956లో సీఐడి చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. ప్యాసా, గైడ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో వహీదా నటించారు. ఐదు దశాబ్దాల కాలంలో వహీదా 90కిపైగా చిత్రాల్లో నటించారు.1971లో వహీదా జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 1972 పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.