భారత
వాయుసేనలోకి మరో అత్యుధునిక రవాణా విమానం చేరింది. ఎలాంటి ఉపరితలంపైన అయినా టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సత్తా ఉన్న సరికొత్త
రవాణా విమానం C-295ను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్,
వాయుసేనకు అప్పగించారు.
9 టన్నుల బరువును రవాణా చేయగల ఈ విమానం,
260 నాటికల్ మైల్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది.
సైనిక దళాల చేరవేతకు ఉపయోగపడేలా
దీనిని రూపొందించారు. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న హెచ్ఎస్-748 ఆవ్రో ఎయిర్ క్రాఫ్ట్
స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది.
ఈ
విమానాలను మొత్తం 56 కొనుగోలు చేసేందుకు ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో
భారత్ రూ. 21,935 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం 2025
నాటికి 16 విమానాలను ఎయిర్ బస్ సరఫరా చేస్తుంది.
పారా
ట్రూప్స్ ను చేరవేయడంతో పాటు ఇతర బరువులు, సాధారణ రాకపోకలకు , అత్యవసర వైద్య సేవలకు…
ఇలా పలురకాలుగా ఈ విమానం ఉపయోగ పడుతుంది.
విపత్తుల సమయంలోనూ సాయం అందించేందుకు,
సాగరగస్తీకి కూడా దీనిని ఉపయోగించవచ్చు. సాధారణ విమానాలు దిగలేని ప్రదేశాల్లో సైతం
ఇది తేలికగా ల్యాండ్ అవుతుంది.
గజియాబాద్
పర్యటనలో భాగంగా భారత్ డ్రోన్ శక్తి-2023 ఎగ్జిబిషన్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్
సింగ్ ప్రారంభించారు. భారత వాయుసేన, డ్రోన్ ఫెడరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ
ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.