స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడి కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఐదు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. రెండు పిటిషన్ల విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
రెండు రోజులు కస్టడీలో చంద్రబాబును విచారించిన వివరాలతో కూడిన సీల్డ్ కవర్ను సీఐడీ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా, ముందుగా బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.ఇరువర్గాల వాదనలను పరిశించిన న్యాయమూర్తి, రెండు కేసుల విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.