రెండు వేల నోట్ల మార్పిడికి గడువు ముంచుకొస్తోంది. సెప్టెంబరు 30తో 2 వేల నోట్ల మార్పిడి గడువు ముగియనుంది. ఇంకా ఐదు రోజులో మిగిలింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 23 నుంచి 2వేల నోట్లను బ్యాంకుల్లో మార్పుకునేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది.
ఈ నెల 30 వరకు 2 వేల నోట్ల మార్పిడికి అవకాశం ఉంది. అయితే 28న మిలాద్ ఉన్ నబి పండగ కారణంగా బ్యాంకులకు సెలవు. అంటే ఈ నెలలో ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల ఒకటి నాటికి ఇంకా 7 శాతం నోట్లు వెనక్కు రావాల్సి ఉందని ఆర్బిఐ ప్రకటించింది. గడచిన 24 రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయనేది ఇంకా తేలాల్సి ఉంది.
నోట్ల మార్పిడికి గడువు పొడగించే అవకాశం లేదని ఆర్బిఐ తెలిపింది. అయితే 2 వేల నోటు లీగల్ టెండర్ కొనసాగించే అవకాశం ఉంది.గడువు ముగిసిన తరవాత కేవలం ఆర్బిఐ శాఖల్లో 2 వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే నిర్దేశిత గడువులోగా 2 వేల నోట్లు ఎందుకు మార్చుకోలేదో సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల