జనసేన
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్
ఒకటి నుంచి కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని ఆ పార్టీ
పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మనోహర్..యాత్ర సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై
దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 1న అవనిగడ్డ నియోజకవర్గంలో యాత్ర మొదలవుతుందని,
మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ప్రణాళిక
సిద్ధమైనట్లు తెలిపారు.
ఈ
ఏడాది జూన్ 14న మొదటి విడత వారాహి యాత్ర ప్రారంభమైంది.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 32 రోజుల పాటు
యాత్ర చేశారు.
తొలిరోజు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని యాత్రను మొదలుపెట్టారు.
గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు పర్యటించి ప్రజల సమస్యలు
తెలుసుకున్నారు. జనసేన పార్టీ అజెండాను ప్రజలకు వివరించారు.
చంద్రబాబు
అరెస్టుతో పాటు టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారు నేపథ్యంలో కృష్ణా జిల్లా వారాహి
యాత్ర రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ
టీడీపీ చేపట్టిన నిరసనకు జనసేన బేషరతుగా మద్దతు తెలిపింది. తెలుగు తమ్ముళ్ళతో
సమానంగా జనసైనికులు రోడ్లపైకి వచ్చి వైసీపీ వ్యతిరేక నినాదాలు చేసి నిరసన వ్యక్తం
చేశారు.
మరో
వైపు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం కూడా త్వరలో పునఃప్రారంభం
కాబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కేడర్ల మధ్య సమన్వయం
కుదురుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తుపై బీజేపీ
ఇంకా ఏ విషయం తేల్చలేదు. దీంతో జనసేన, బీజేపీ సంబంధాలు బలహీనపడే అవకాశం ఉందని కూడా
పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం