రంగరంగ
వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి సాలకుట్ల బ్రహ్మోత్సవాలు ఆఖరి దశకు
చేరుకున్నాయి. ఇవాళ ఎనిమిదో రోజు స్వామివారికి ఉభయ దేవేరులతో కలిపి రథోత్సవం
నిర్వహించారు. ఉదయం 6గంటల 55 నిమిషాలకు రథోత్సవం మొదలుకాగా, పెద్దసంఖ్యలో భక్తులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలేశుడి ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.
రాత్రికి
స్వామివారు అశ్వవాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించనున్నారు. స్వామి అశ్వవాహనరూఢుడై
కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన
అవతారం ద్వారా సందేశమిస్తారు.
ఆదివారం
రాత్రి శ్రీస్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. నవనీతచోరుడైన కృష్ణుడి
అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
సెప్టెంబర్ 26 మంగళవారం నాడు చక్రస్నాన మహోత్సవంతో
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమలలో
భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆదివారం
నాడు శ్రీవేంకటేశ్వరస్వామిని 66, 598 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు
వెల్లడించారు. 25,103 మంది తలనీలాలు సమర్పించారు.