నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధించిన రెండు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో
చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం
రిమాండ్ తో పాటు కస్టడీ పొడిగించాలని సీఐడీ అధికారులు న్యాయమూర్తిని కోరారు.
కస్టడీ ముగిసినందున అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అనంతరం చంద్రబాబుతో
మాట్లాడారు. అనంతరం రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు జడ్జి
చెప్పారు.