భారత
రైల్వే శాఖలో నేటి నుంచి మరిన్ని వందే భారత్ సర్వీసులు చేరాయి. ప్రధాని నరేంద్ర
మోదీ ఈ సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. 11 రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ
రాకపోకలు సాగించే ఈ రైళ్ళు ప్రయాణికుల సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తాయి.
దేశవ్యాప్తంగా
ఇప్పటికే 25 వందే భారత్ రైళ్ళు అందుబాటులో ఉండగా నేడు ప్రారంభించిన మరో 9
సర్వీసులతో మొత్తం 34 ట్రెయిన్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి.
విజయవాడ-చెన్నైసర్వీసు
విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది.
చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయలు దేరి ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ
చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో ప్రారంభమవుతోంది.
చైర్
టికెట్ ధర రూ. 1420కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,630 గా నిర్ణయించారు. రేణిగుంటలో
5 నిమిషాల స్టాపును నిర్దేశించారు.
కాచిగూడ-బెంగళూరు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ లోని కాచిగూడ, బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య
నడుస్తుంది. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఆగుతుంది. ఈ
రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు
చైర్ కార్ కోచ్లు ఉంటాయి.
ఉదయ్‌పూర్
–జైపూర్ మధ్య కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. రాజిస్థాన్‌లో ఇది మూడో వందే
భారత్ రైలు, మిగిలిన రెండు సర్వీసులు జోధ్‌పూర్-సబర్మతి, అజ్మీర్-దిల్లీ మధ్య
పరుగులు తీస్తున్నాయి.
తిరునెల్వేలి-మధురై-చెన్నై
మధ్య కూడా ఓ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలకు
తగ్గనుంది. పాట్నా-హౌరా సర్వీసు బిహారులోని పాట్నా జంక్షన్ నుంచి పశ్చిమబెంగాల్
లోని హౌరాతో కలుపుతుంది.
కాసర్‌గోడ్-తిరువనంతపురం వందే భారత్ సర్వీసు కేరళకు
చెందినది, ఈ రైలు అందుబాటులోకి రావడంతో మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఏడు
గంటల 55 నిమిషాల్లో 573 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
పూరీ-భువనేశ్వర్
సర్వీసు ఒడిశాలోని పూరిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం12.45 గంటలకు
రూర్కెలా చేరుతుంది.
రాంచీ-హౌరా సర్వీసు మంగళవారం మినహా ఆరు రోజులు నడుస్తుంది.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ను కలిపే వేగవంతమైన రైలు సర్వీసు ఇది. జామ్‌నగర్-అహ్మదాబాద్
సర్వీసు 4 గంటల 40 నిమిషాల్లో 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.