స్కిల్
డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు రెండో
రోజు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం
విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, జైలు
కాన్ఫరెన్స హాలులో ప్రశ్నిస్తున్నారు.
రెండు
బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. సాయంత్రం ఐదుగంటల వరకు విచారణ కొనసాగనుంది.
నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. దీంతో
విచారణ అనంతరం అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.
తొలిరోజు
నాలుగు దశల్లో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. డొల్ల కంపెనీల ద్వారా నిధుల
మళ్ళింపు ఆరోపణలపై నేడు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజమండ్రి
సెంట్రల్ జైలు ఆవరణలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెండు అంచెల భద్రతా చర్యలు
తీసుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి
చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
స్కిల్
డెవలప్మెంట్ వ్యవహారంలో తనను విచారించేందుకు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి
ఇస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత
చంద్రబాబు తరఫున హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా
విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రణతి హైకోర్టును అభ్యర్థించారు.
న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ రెడ్డి అందుకు నిరాకరించారు. సాధారణ పద్ధతిలో తమ
ముందుకు వస్తే విచారిస్తామని పేర్కొన్నారు.