ఖలిస్తానీ
వేర్పాటు వాది, ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ హర్దీప్ సింగ్ నిజ్జర్, నేరచరిత్ర
తాజాగా వెలుగులోకి వచ్చింది. 1980 నుంచే నేరాలకు పాల్పడేవాడని, స్థానిక రౌడీమూకలతో
అతనికి సంబంధాలు ఉండేవని అదికారుల విచారణలో తేటతెల్లమైంది.
1996లో
నకిలీ పాస్‌పోర్టుపై కెనడా వెళ్లిన నిజ్జర్, ట్రక్కు డ్రైవర్ గా పనిచేసేవాడు.
తదనంతరం పాకిస్తాన్ వెళ్ళి ఆయుధాల కొనుగోలు చేయడంతో పాటు పేలుళ్లకు సంబంధించిన
శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెనడాలో ఉంటూనే పంజాబ్ లో నేరాలకు పాల్పడేవాడని,
పలువురిని హత్య చేయించడంతో పాటు దాడులకు ప్రోత్సహించాడని స్పష్టమైంది.
పంజాబ్
లోని జలంధర్ ప్రాంతానికి చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్, గ్యాంగ్‌స్టర్ గుర్నీక్
సింగ్ అలియాస్ నికా తో సన్నిహితంగా మెలిగేవాడని అతడి అందదండలతో నేరసామ్రాజ్యంలో
అడుగుపెట్టాడని పోలీసులు నివేదికలు పరిశీలిస్తే తెలుస్తోంది.
1980నుంచి 190 వరకు
ఖలిస్తాన్ కమాండ్ ఫోర్సు లో పనిచేసిన నిజ్జర్, 2012 నుంచి ఖలిస్తానీ టైగర్ ఫోర్స్
చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో కలిసి పనిచేశాడు. అనంతరం పలు తీవ్రవాద కార్యకలాపాల్లో
కీలకపాత్ర పోషించి, 1996లో కెనడాకు పారిపోయాడు.
డ్రగ్స్,
ఆయుధాలు అక్రమంగా సరఫరా చేయడంతో పాటు తీవ్రవాదులకు నిధులు సమకూర్చేవాడు.
జగ్తార్
సింగ్ తారాతో కలిసి పంజాబ్ లో ఉగ్రదాడికి కుట్రపన్నాడు. అందుకు కోసం ఓ ముఠాను కూడా
ఏర్పాటు చేసి వారికి కెనడాలో ఆయుధ శిక్షణ ఇప్పించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
పంజాబ్
లోని మోకాకు చెందిన గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలా కూడా
తీవ్రవాద కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవాడు. ఇతని ద్వారా నిజ్జర్ జంట
హత్యలకు ప్లాన్ చేశాడనే అభియోగాలు
ఉన్నాయి. కెనడాలో ఉంటూనే పంజాబ్ లో నేరాలకు పాల్పడేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న
నిజ్జర్ .. జూన్ లో కెనడాలో హత్యకు
గురయ్యాడు.