దేశంలో
తొలి హైస్పీడ్ రైలు మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్వినీ
వైష్ణవ్ తెలిపారు. గుజరాత్ లోని అహ్మదాబాద్, సనంద్ మధ్య రాకపోకలు సాగించనున్నట్లు
వెల్లడించారు. సనంద్‌లో సెమీకండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్
శంకుస్థాపన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్టేషన్లలో వందే భారత్ రైళ్ళు
కూడా ఆగుతాయని ప్రకటించారు.
ప్రధాని
నరేంద్రమోదీ రేపు ఒకేసారి 9 వందే భారత్ రైళ్ళను ప్రారంబించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రైళ్ళు అందుబాటులో
ఉండగా, కొత్తగా వచ్చే వాటితో కలిపి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ సంఖ్య 34కు
చేరనుంది.
తాజాగా
ప్రారంభించే రైళ్ళలో రెండు సర్వీసులు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు
సాగించనున్నాయి. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఓ రైలు నడవనుండగా, విజయవాడ-చెన్నై మధ్య
మరో సర్వీసు పరుగులు
తీయనుంది.
రానున్న
కాలంలో సెమీ కండక్టర్ల డిమాండ్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్న కేంద్రమంత్రి
అశ్విని వైష్ణవ్ ఈ రంగంలో గుజరాత్ ముందువరుసలో ఉందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లింగ్
పాయింట్, టెస్ట్ ప్లాంట్‌ను గుజరాత్ లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్ ఇటీవల
వెల్లడించింది. ఇందు కోసం రూ. 22,140 కోట్లు మేర పెట్టుబడులు పెట్టనుంది.