నైరుతి
రుతుపవనాలు ఈ నెల 25 తర్వాత వాయవ్య భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయని
పేర్కొంది.
రాబోయే
ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయని, పశ్చిమ రాజస్థాన్
నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నాయని
తెలిపింది.
రాష్ట్రానికి
సంబంధించిన వాతావరణ నివేదికను అమరావతి విభాగం విడుదల చేసింది. ఈ రోజు, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక
మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల
కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు లేదా ఉరుములతో కూడిన
జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.