రాష్ట్రంలో
మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
అన్నారు. విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ ఫొటో
ఎగ్జిబిషన్‌ను పురందరేశ్వరి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం
ద్వారా వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు.
నరసాపురంలో
నిన్న మద్యం దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు నగదు లావాదేవీల్లో అక్రమాలు బయట
పడ్డాయన్నారు. మధ్యాహ్నం సమయానికి లక్ష రూపాయల మేరకు విక్రయాలు జరిగితే అందులో
డిజిటల్ చెల్లింపులు జరిగింది రూ. 700 మాత్రమేనన్నారు.
ప్రజల
కష్టార్జితాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని దుయ్యబట్టిన పురందరేశ్వరి,
ప్రతిరోజు మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ సంపాదన
పొగేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల కష్టాన్ని దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనే
దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థనీయం కాదన్నారు.