అధికార
ఎన్డీయేలో మాజీ ప్రధాని దేవగౌడ్‌కు చెందిన జేడీ(ఎస్) చేరింది. కర్ణాటక మాజీ
ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి, దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను
మర్యాదపూర్వకంగా కలిసి ఎన్డీయేలో అధికారికంగా చేరుతున్నట్లు తెలిపారు.
అమిత్
షాతో కుమారస్వామి జరిపిన చర్చల్లో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.
పార్లమెంటు భవనంలో దేవగౌడ్, అతని కుమారుడు కుమారస్వామి, బీజేపీ చీఫ్ జేపీనడ్డాతో
పాటు అమిత్ షాతో గురువారమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై చర్చ
జరిగినట్లు సమాచారం.
గడిచిన
కొన్ని నెలలుగా బీజేపీ-జేడీఎస్ పొత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. రానున్న లోక్
సభ ఎన్నికల్లో ఇరుపార్టీలు పొత్తుతో పోటీ చేస్తాయని తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం
28 ఎంపీ సీట్లు ఉండగా, జేడీఎస్‌కు నాలుగు సీట్లు కేటాయించేందుకు బీజేపీ సుముఖత
తెలిపింది.
2019
లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేశాయి. అయితే బీజేపీ 25 సీట్లలో
విజయం సాధించింది. మాండ్యలో బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం
సాధించారు.
తాజాగా
జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 19
సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ చరిత్రలో మొదటి సారి అత్యంత తక్కువ సీట్లకు పరిమితం
కావాల్సి వచ్చింది.
ఇటీవల జరిగిన ఎన్డీయే, ఇండియా సమావేశాల సందర్భంగా ఏ కూటమి నుంచి ఆ పార్టీకి పిలుపురాకపోవడం
గమనార్హం.