యాపిల్
కొత్త ఐఫోన్ 15 సీరీస్ అమ్మకాలు దేశంలో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్ల కొనుగోలుకు వినియోగదారులు
ముంబై, దిల్లీలోని బ్రాంచ్‌ల దగ్గర క్యూ కట్టారు. యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సీరీస్‌ను
సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను
అందుబాటులోకి తెచ్చారు. ఐఫోన్-15, ఐఫోన్-15 ప్లస్, ఐఫోన్-15 ప్రో, ఐ ఫోన్-15 ప్రో
మ్యాక్స్, భారత్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రారంభ ధరను రూ. 79,900గా
నిర్ణయించగా, ప్లస్ వెర్షన్ ధర రూ. 89,900, 15 ప్రో వెర్షన్ ధర రూ.1,34,900, 15 ప్రో
ధర రూ. 1,59,900గా నిర్ణయించింది.
లాంచ్
ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో ఐఫోన్ 15 సీరీస్ కొనుగోలు చేసేవారు తక్షణమే
రాయితీ పొందవచ్చు. అలాగే పాత ఐఫోన్‌ను మార్చుకోవడం ద్వారా ట్రేడ్ ఇన్ బెనిఫిట్
కింద డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు
ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.
ఐఫోన్15
ప్రో మ్యాక్స్ లో బ్లూ టైటానియం, బ్లాక్ టైటానియం కలర్ వేరియంట్లు అక్టోబర్
మూడోవారంలో కొనుగోలుదారుల చేతికి రానున్నట్లు సమాచారం. నేచురల్ టైటానియం, వైట్
టైటానియం వేరియంట్లు నవంబర్ రెండోవారంలో మార్కెట్ లోకి రానున్నాయి.