స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ తరపు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఇప్పటికే టీడీపీ నేతలు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు తమ కస్టడీకి అనుమతించాలంటూ సీఐడి వేసిన కేసులో ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ ముగియడంతో మరో రెండు రోజులు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.