శ్రీరాముడి
చరిత్ర, జీవిత విశేషాలు తెలిపేలా దేశవ్యాప్తంగా రాతి స్తూపాలు ఏర్పాటు చేయాలని
శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రధాని కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అశోక్
సింఘాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
దేశంలో 290 ప్రదేశాల్లో శ్రీరామ్ రాతి స్తంభాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
నిర్వహణ ఖర్చును కూడా ఆ సంస్థే భరిస్తుందన్నారు.
వాల్మీకి
రామాయణంలో ఉన్న స్థల పురాణంలోని వివరాలను వివిధ ప్రాంతీయ భాషల్లో స్తంభాలపై
పొందుపరుస్తామన్నారు. శ్లోకాల అర్థాలు స్థానికులకు సులువుగా అర్థమయ్యే వివరణ కూడా
ఉంటుందన్నారు.
మొదటి శ్రీరామ రాతి స్తూపం సెప్టెంబర్ 27న అయోధ్యకు చేరుకుంటుందని
దానిని మణి పర్వతంపై ప్రతిష్టిస్తామని చెప్పారు.
శ్రీరాముడి
జన్మభూమి అయిన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం
ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిరంతరాయంగా నిర్మాణ పనులు
సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులు పాటు ప్రాంరభోత్సవ వేడుకలు
నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది
ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రారంభోత్సవానికి సన్నాహకంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్
15 వరకు లక్షలాది గ్రామాల్లో శౌర్యయాత్రకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది.
2020
ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ
కారణంగా అప్పట్లో పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. ఆలయంలోని రామ్ లల్లా గుర్భగుడి
నిర్మాణం దాదాపు ఆఖరి దశకు చేరింది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా
నిర్వహించే వేడుకల్లో ఆలయ కమిటీ మునిగిపోయింది. రోజుకు 75 వేల నుంచి లక్షమందికి
అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.