జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన అధికారులకు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి విందు ఇవ్వనున్నారు. ఢిల్లీ పోలీసులు,
విదేశాంగ శాఖ, సాంస్కృతిక శాఖ, ఐటీపీఓ, హోంశాఖ తదితర విభాగాలకు చెందిన అధికారులు,
ఇతర సిబ్బందికి ప్రధానమంత్రి విందు ఇస్తారు.
భారత ప్రభుత్వంలోని 22 విభాగాలకు చెందిన కనీసం
2,500 మంది అధికారులు, సిబ్బంది ఈ విందుకు హాజరవుతారు. వారిలో 700 మంది విదేశాంగ
శాఖకు చెందిన వారు, 300మంది ఢిల్లీ పోలీస్, ఎస్పీజీ, రాజ్‌ఘాట్, సీఐఎస్‌ఎఫ్, భారత
వైమానిక దళం, తదితర విభాగాలకు చెందినవారు ఉన్నారు. విందు సందర్భంగా ప్రధానితో
గ్రూప్ ఫొటో కూడా ఉంటుంది. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక పోలీస్
కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని ఢిల్లీ పోలీస్ అధికారులు
వెల్లడించారు.
భారత అధ్యక్షతన జరిగిన
జి-20 సదస్సుకు సుమారు 40 దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం
ఈ సదస్సును ‘వసుధైవ కుటుంబకం’, ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే థీమ్‌తో
నిర్వహించింది.