దేశీయ
స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే
సమయానికి సెన్సెక్స్ 570 పాయింట్లు నష్టపోయి 66,230కి దిగజారింది. నిఫ్టీ 159 పాయింట్లు
కోల్పోయి 19,742కి దిగజారింది. అంతర్జాతీయ ప్రతికూలతలతో మదుపర్లు తీవ్రంగా
నిరాశపడ్డారు.
సోమవారం
242 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ , బుధవారం నాడు 796 పాయింట్లు, గురువారం 570
పాయింట్లు క్షీణించింది. వారంలో 1,608 పాయింట్లు నష్టపోయింది. గణేశ్ చతుర్థి
సందర్భంగా స్టాక్ మార్కెట్కు మంగళవారం సెలవు ప్రకటించారు.
బీఎస్ఈ
లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 318 కోట్లకు తగ్గగా, పెట్టుబడుల
దారుల 5.4 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది.
యూఎస్
ఫెడరల్ గతరాత్రి ఎలాంటి వడ్డీరేట్లు పెంచలేదు.
ఈ ఏడాది 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపుతో పాటు, వచ్చే సంవత్సరం లో 50 పాయింట్లు
తగ్గించాలనే అంచనా వేసింది.