భారత
రైల్వే శాఖ ఒకేసారి తొమ్మిది వందే భారత్ రైళ్ళను పట్టాలెక్కించనుంది. ప్రధాని
నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న వర్చువల్ గా వీటిని జెండా ఊపి ప్రారంభిస్తారు.
అధునాతన సాంకేతికతతో తయారైన వందే భారత్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
కల్పిస్తున్నారు. ప్రధాని ప్రారంభించనున్న సర్వీసుల్లో విజయవాడ-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్
సర్వీసులు కూడా ఉన్నాయి.
విజయవాడ
–చెన్నై వందే భారత్ రైలు, 6 గంటల 40 నిమిషాల్లో గమ్యాన్ని చేరుతుందని రైల్వే
అధికారులు తెలిపారు. విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 12.10కి
చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి
10 గంటలకు చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ సర్వీసు
నడవనుంది.
హైదరాబాద్
–బెంగళూరు సర్వీసు, ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు
యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. తిరిగి 2.45 గంటలకు యశ్వంత్ పూర్ లో బయలుదేరి రాత్రి
11.15కు కాచిగూడ చేరుతుంది. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, డోన్, ధర్మవరం
స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
రాంచీ
–హౌరా, పట్నా-హౌరా, తిరునల్వేలి-చెన్నై, రూర్కెలా-పూరీ, ఉదయ్‌పూర్ –జైపూర్, కాసరగోడ్-తిరువనంతపురం,
జామ్‌నగర్-అహ్మదాబాద్ మధ్య కూడా వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
8
కోచ్‌లు ఉన్న వందే భారత్ రైళ్ళు ప్రస్తుతం దేశంలో 25రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి.
వీటికి తోడు మరో 9 ప్రారంభానికి సిద్ధమవడంతో దైశ వ్యాప్తంగా వందేభారత్ సేవలు 35
మార్గాలకు విస్తరించాయి.