వాయవ్య
బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశాల తీరాలకు అనుకుని ఏర్పడిన అల్పపీడనం
కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల
ఆవర్తనం విస్తరించి ఉంది.
అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు
పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నేడు, రేపు రాష్ట్రంలో
అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు
రుతుపవన ద్రోణి రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు
కొనసాగుతోంది.
రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తర,
దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు
వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
బెజవాడలో
రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిని తలపించింది.
సెప్టెంబర్ ఆరంభం నుంచి కురుస్తున్న వానలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. జూన్ లో
రుతుపవనాలు మొహం చాటేయడంతో ఆగస్టులో సరిపడా వర్షాలు కురవలేదు.