మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన మహిళా కోటా బిల్లు ఇవాళ రాజ్యసభలో చర్చకు పెట్టారు. అన్ని పార్టీల నాయకులకు బిల్లుపై చర్చించే అవకాశం కల్పించనున్నారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పెద్దల సభలో ప్రవేశపెట్టారు. వెంటనే చర్చ చేపట్టారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు సాయంత్రం రాజ్యసభలో ఓటింగ్ జరగనుంది. సుదీర్ఘ చర్చ అనంతరం సాయంత్రం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినా 2027 తరవాతే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.