మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా అంగళ్లలో పోలీసులపై దాడికి కొన్ని వర్గాలను ప్రేరేపించారంటూ హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. గత నెలలో అంగళ్లలో చంద్రబాబు ప్రచారం సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో కొందరు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబే కారణం అంటూ అక్కడి పోలీసు అధికారులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందుస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును విచారించాలంటూ సీఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ వేశారు. దీనిపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాలని, ఐదు రోజులు తమకు అప్పగించాలంటూ సీఐడి అధికారులు పిటి వారెంట్ వేశారు.