స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఉదయం ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. తాజాగా సెన్సెక్స్ 537 పాయింట్ల నష్టంతో 67059 వద్ద కొనసాగుతోంది. నిష్టీ 153 పాయింట్లు కోల్పోయి 19980 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.20గా ఉంది. సెన్సెక్స్‌లో ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, టైటన్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఐరోపా, అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఇవాళ ప్రకటన చేయనుంది. వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేదనే అంచనాలున్నాయి. ద్రవ్యోల్భణం కట్టడి చేసేందుకు రాబోయే రోజుల్లో ఫెడ్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే దానిపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ముడిచమురు ధరలు పది నెలల గరిష్ఠాలకు చేరడం కూడా స్టాక్ మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి. బ్యారెల్ ముడి చమురు ధర తాజాగా 94 డాలర్లకు చేరింది.