భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేసిన
చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం అవడంతో దేశ కీర్తి దిగంతాలకు చేరింది. చంద్రుడి మీద
అడుగిడిన నాలుగో దేశంగానూ, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగానూ
భారత్ నిలిచింది.
ఈ అపూర్వమైన రోదసీ విజయం గురించి రాజ్యసభలో
ఇవాళ చర్చిస్తారు. ఈ ఉదయం సభా కార్యక్రమాల్లో ఐదో అంశంగా చంద్రయాన్ 3 గురించి చర్చ
చేపడతారు. అంతకుముందు పలు పత్రాలను సభకు సమర్పిస్తారు. కార్మిక సంక్షేమం,
దుస్తులు, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై స్టాండింగ్ కమిటీ రూపొందించిన
నివేదికలను సభముందు ప్రవేశపెడతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక కూడా ఇవాళ
రాజ్యసభ ముందు ఉంచుతారు.
చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్
ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణధ్రువం మీద విజయవంతంగా సాఫ్ట్‌ల్యాండ్ అయింది. నాలుగేళ్ళ
క్రితం చంద్రయాన్ 2 ప్రయోగం పాక్షికంగా విఫలం అయిన తర్వాత భారత అంతరిక్ష
శాస్త్రవేత్తలు మూడోదశ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసారు. ఆ కీర్తిగాధను
పెద్దలసభ చర్చించి, భారతీయ శాస్త్రప్రపంచపు శక్తిసామర్థ్యాలను ప్రశంసిస్తుంది.