రాజస్థాన్‌లో అరాచకం చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో సంసారం భారంగా మారిన మహిళకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఆ తరవాత
కుట్రతో ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి తాగించాడు. తన ఐదుగురు స్నేహితులతో కలసి 14 రోజుల పాటు గ్యాప్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.
రాజస్థాన్ భరత్‌పూర్‌లోని ఓ హోటల్లో ఈ అఘాయిత్యం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు కామాంధులు వితంతువుపై 14 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి కథనం ద్వారా తెలుస్తోంది. కామాంధుల నుంచి తప్పించుకుని బాధిత మహిళ కామా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులంతా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ దేశ్‌రాజ్ కుల్దీప్ వెల్లడించారు.