అమరావతి రాజధాని రింగురోడ్డు అలైన్మెంట్ మార్చడం ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థన పిటిషన్ను ఈ నెల 21కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ పథకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసి రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ ఈ నెల 23తో ముగియనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ స్కామ్ కేసుతో పాటు మరో మూడు కేసులు నమోదు చేశారు. అమరావతి అవుటర్రింగురోడ్డు అలైన్మెంట్లో అవినీతి, చిత్తూరు జిల్లా పుంగనూరు అంగళ్ల వద్ద జరిగిన అల్లర్ల కేసుతోపాటు, విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం