తమకు
గాజు గ్లాసు గుర్తు కేటాయించాలంటూ జనసేన పార్టీ చేసిన వినతిపై కేంద్రఎన్నికల సంఘం
సానుకూలంగా స్పందించింది. గతంలో కేటాయించిన గుర్తునే జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
గత
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తు పై పోటీ చేసింది. కానీ రాష్ట్రస్థాయిలో
గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు,
కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు
5.9 శాతం ఓట్లు వచ్చాయి. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు
పొందలేకపోయారు. ఈ కారణంగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చారు.
తిరుపతి
లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు
తెలిపిన జనసేన పోటీ చేయలేదు. దీంతో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర్య అభ్యర్థికి
కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
జనసేన
పార్టీ నుంచి అందిన వినతి మేరకు గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి రిజర్వు చేస్తూ
ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ సమస్య తీరిపోయింది.
గత
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన తన అభ్యర్ధులను నిలిపింది. అలాగే
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ ఆపార్టీ ఏడు
స్థానాల్లో పోటీ చేసింది.
ప్రస్తుతం
టీడీపీ, జనసేన పొత్తుగా ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సమయంలో ఈసీ తీసుకున్న
నిర్ణయం ఆ పార్టీకి మేలు చేస్తుంది. లేదంటే గుర్తు విషయంలో గందరగోళం ఏర్పడేది.
తమ
పార్టీకి మరోసారి గ్లాసు గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి ఆపార్టీ అధినేత
పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.