పాత పార్లమెంటు మూగబోయింది. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చివరి ప్రసంగం చేసిన మోదీ, ఇక నుంచి ఈ భవనాన్ని సంవిధాన్ సదన్ అని పిలుచుకోవాలని కోరారు. పార్లమెంట్ నూతన భవనంలోకి మారడంతో, పాత భవనానికి విశ్రాంతి ఇచ్చారు. ఇక నుంచి పార్లమెంట్ పాత భవనాన్ని సందర్శకుల కోసం తెరచి ఉంచనున్నారు.
బ్రిటిష్ రూపశిల్పి ఎడ్విన్ లూట్యెన్స్ , హెర్బట్ బేకర్ పార్లమెంట్ పాత భవనానికి 1913లో డిజైన్ చేశారు. 1927లో పార్లమెంట్ పాత భవనాన్ని పూర్తి చేశారు. అనేక చారిత్రక ఘట్టాలకు పాత భవనం సాక్షిగా నిలిచింది. బ్రిటిష్ వారి నుంచి భారత్ స్వతంత్య్రాన్ని స్వీకరించింది కూడా ఈ భవనంలోనే కావడం విశేషం. ఇందులో 4 వేల చట్టాలను రూపొందించారు. 75 సంవత్సరాలు ఉభయసభలతోపాటు, ఉమ్మడి సమావేశాలకు సెంట్రల్ హాల్ వేదికైంది. నేడు కొత్త భవనంలోకి మారడంతో ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్ని సేవలు అందించిన భవనాన్ని ఇక నుంచి రాజ్యాంగ భవనం అని పిలుచుకుందామని సూచించారు.
రాజ్యాంగాన్ని ఆమోదించింది కూడా ఈ భవనంలోనే కావడంతో ఇక నుంచి పాత పార్లమెంటు పేరు సంవిధాన్ సదన్గా మారనుంది. రాబోయే తరాలకు ఈ భవనం ఒక తీపి గుర్తుగా మిగిలిపోనుంది.