ఆస్ట్రేలియాతో
జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత సెలక్టర్లు రెండు వేరువేరు జట్లను
ప్రకటించారు. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో భారత్ వేదికగా ఈ సిరీస్ జరగనుంది. తొలి
రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్
యాదవ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ప్రకటించారు.
మూడో వన్డేకు వీరంతా తిరిగి
జట్టులోకి వస్తారు. దీంతో తొలి రెండు మ్యాచ్‌లకు భారత్‌కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.
వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు.
ఆసియా
కప్ సందర్భంగా గాయపడిన అక్షర్ పటేల్ కూడా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు.
వాషింగ్టన్ సుందర్ కు రెండు జట్లలో స్థానం దక్కగా, తిలిక్ వర్మకు రెండు వన్డేలకు
ప్రటించిన జట్టులో స్థానం ఖరారైంది.
ఆస్ట్రేలియా,
భారత్ మధ్య తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్
బింద్రా స్టేడియంలో జరుగనుంది. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా
సెప్టెంబర్ 24న జరిగే రెండో వన్డే లో ఇరు
జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 27న మూడో
వన్డే కోసం రాజ్‌కోట్ సిద్ధమైంది. మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు
ప్రారంభమవుతాయి.
ఆసీస్
తో తొలి రెండు వన్డేలకు భారత్ జట్టు: కేఎల్
రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్,
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా(వైస్
కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్
బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆసీస్
తో మూడో వన్డే జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), విరాట్
కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్
కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్
సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ,
మహ్మద్ సిరాజ్
కీలక
ఆటగాళ్ళకు విశ్రాంతి ఇవ్వకపోతే, సుదీర్ఘంగా జరగనున్న వరల్డ్‌కప్ లో మానసికంగా లేదా
శారీరకంగా అలసిపోతారని చెప్పిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అప్పుడు పక్కన
పెట్టడం కంటే ఇప్పుడు విరామం ఇవ్వడం వల్ల మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు అవకాశం
ఉంటుందని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు.