కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మీరా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఉదయం కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా, ఆమె ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. చదువులో తీవ్రమైన ఒత్తిడితోనే మీరా ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీలో మీరా ఇంటర్మీడియట్ చదువుతోంది.
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని, నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి మీరా ఆంటోని, లారా విజయ్ ఆంటోని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆంటోనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.