భారత్
చేపడుతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మానవసహిత గగన్యాన్ కు కీలక పరీక్షలు
నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైనట్లు ప్రాజెక్టు డైరక్టర్ హట్టన్ తెలిపారు. ఇప్పటికే
నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్న ఇస్రో, మరింత మందిని తన బృందాన్ని మరింత
విస్తరించేందుకు సన్నద్ధమైంది.
ముగ్గురు
వ్యోమగాములను 400కిలోమీటర్ల కక్ష్యలో మూడు రోజుల పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్ళి
అనంతరం విజయవంతంగా వెనక్కి తీసుకొచ్చి భారత సముద్రజలాల్లో సురక్షితంగా దింపడమే ఈ
ప్రాజెక్టు ఉద్దేశ్యం.
గగన్యాన్
ప్రాజెక్టు ముగిసిన అనంతరం అతరిక్షంలో మానవ ఉనికిని కొనసాగించే మార్గాలు
అన్వేషిస్తామని ఇస్రో తెలిపింది.
అత్యవసర
పరిస్థితుల్లో బయటపడే మార్గాలను ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు, అలాగే బ్యాటరీ
సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు అఖరి దశ పరీక్షలు ఉపయోగపడతాయని హట్టన్ తెలిపారు.
భద్రతే తమ పరీక్షల ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ
ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం రూ.9,200 కోట్లు కేటాయించింది. గగన్యాన్ ప్రయోగ
ప్రారంభానికి కచ్చితమైన తేదీని వెల్లడించకపోయినప్పటికీ 2024 చివరిలో లేదా 2025
ఆరంభంలో ఉండవచ్చు అని తెలుస్తోంది.
ఈ
ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోదీ,
2018 స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో వెల్లడించారు. 2022లోనే పూర్తి చేయాల్సి
ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.
ఈ ప్రయోగంలో అధునాతన శాస్త్రసాంకేతికతను వాడుతున్నారు.
మానవ సహిత ప్రయోగం కావడంతో భూమిపై
ఉండే వాతావరణాన్ని ఈ మిషన్ లో కల్పించాల్సి ఉంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో
వ్యోమగాముల భద్రతకు కూడా వెసులుబాటు కల్పించారు. ఈ పరీక్షల్లో విజయవంతమైతే మరో
ఏడాదిలో గగన్యాన్ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్ళనుంది.