సూర్యుడిపై
పరిశోధనలకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1 కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉపగ్రహంలోని ఓ
పేలోడ్ కు అమర్చిన స్టెప్స్ పరికరం పని చేయడం ప్రారంభించింది. భూమికి 50 వేల
కిలోమీటరల్ దూరంలో
సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్,
ఎలక్ట్రాన్స్ కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి చుట్టూ ఉన్న
పార్టికల్స్ ప్రవర్తను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది.
వాతావరణం మారే కొద్దీ
శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్1 లోని స్టెప్స్(సూప్ర
థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్టోమీటర్) గుర్తించింది.
ఆదిత్య
సోలార్ విండ్ పార్టికల్ ఎక్సిపెరిమెంట్ లో ఈ పరికరంతో తన పనిచేయడం మొదలు
పెట్టినట్లు ఇస్రో వెల్లడించింది.
సెప్ట్
పరికరంలో ఆరు సెన్సార్లు ఉండగా, వేరు వేరు దిశల్లో కణాలను గుర్తిస్తుంది. సెప్టెంబర్ 10న ఈ పరికరాన్ని
ఆన్ చేశారు. దీనిని ఫిజికల్ రిసెర్చ్ లేబరోటరీ అనే సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్
సాయంతో తయారు చేసింది.
ఆదిత్య
ఎల్ 1 స్పేస్ మిషన్ ఆఖరి దశ కక్ష్య పెంపు మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో భూ
ప్రదక్షిణ దశ ముగియనుంది. రేపు తెల్లవారు
జామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. తర్వాత
సూర్యుడు-భూమి లగ్రాంజ్ 1కు చేరుతుంది.
ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల
దూరంలో ఉంది. ఈ పాయింటులో సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకుని
ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లంగ్రాంజ్ పాయింట్లను గుర్తించగా,
ఆదిత్య ఎల్ 1 తొలిపాయింటుకు చేరుకుంటుంది.