Parliament : ఏపీ విభజన సక్రమంగా జరగలేదు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన సక్రమంగా జరగలేదని గత కాంగ్రెస్ పాలకుల తప్పిదాలను గుర్తు చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య పరిరక్షణకు వేదికైన పార్లమెంటు భవన విశేషాలను మోదీ మరోసారి గుర్తుచేశారు. పాత పార్లమెంటు భవనంలో ఎందరో మహానుభావులు తమ సేవలు అందించారని, రేపటి నుంచి కొత్త భవనంలోకి సమావేశాలు మారుతున్నా, పాత భవనం సందర్శకుల కోసం తెరిచే ఉంటుందన్నారు. యూపీఏ పాలనలో ఏపీ విభజన సక్రమంగా జరగలేదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఏపీ విభజన తరవాత అటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అసంతృప్తికి లోనయినట్టు ఆయన ప్రధాని మోదీ తెలిపారు.
చారిత్రక పాత పార్లమెంట్ భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నాం. స్వాతంత్ర భారతానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్‌గా ఉందేదని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ భవనం వేదికైందని ఆయన తెలిపారు. కొత్త భవనంలోకి సమావేశాలు మారినా, పాత భవనం మనకు నిరంతరం ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.