భారత కళాకారిని అమృత షేర్ గిల్ పెయింటింగ్ రికార్డు ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో షేర్ గిల్ కళాఖండానికి రూ.61.8 కోట్ల రికార్డు ధర దక్కింది. ఒక భారతీయ కళాకారుని కళాఖండానికి ఇంత ధర దక్కడం ఇదే మొదటి సారి. 1937లో భారత కళాకారుడు ది స్టోరీ టెల్లర్ పేరుతో ఈ కళాఖండం చిత్రించారు. ఇటీవల సఫ్రాన్ ఆర్ట్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళాఖండానికి రూ.61.8 కోట్ల ధర దక్కింది.
షేర్ గిల్ భారతదేశ జాతీయ కళా సంపదలో ఒకరని వేలం సంస్థ కొనియాడింది. ఇలాంటి కళాఖండం అమ్మకానికి రావడం చాలా అరుదని వేలం సంస్థ సహ వ్యవస్థాపకుడు మినల్ వజిరాణి అభిప్రాయపడ్డారు. శ్రీమతి షేర్ గిల్ 84 రచనలు కూడా వేలం వేసినట్టు ఆమె తెలిపారు. షేర్ గిల్ 1913లో బుడాపెస్ట్‌లో జన్మించారు. ఆమె తండ్రి ఉమ్రావ్ సింగ్ షేర్ గిల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. వారికి సంస్కృతం, పర్షియన్ భాషల్లోనూ ప్రావీణ్యం ఉంది.
షేర్ గిల్ తట్టి మేరీ ఆంటోనెట్ హంగేరియన్ జాతీయురాలు. మంచి గాయని కూడా. షేర్ గిల్ ఐదేళ్ల వయసులోనే పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేయడం మొదలు పెట్టారు.
వాటర్ కలర్స్‌లో ఆమె అద్భుతమైన చిత్రాలు వేశారు. షేర్ గిల్ కుటుంబం 1921లో భారత్ తిరిగి వచ్చి సిమ్లాలో స్థిరపడ్డారు. ఆమె 1941లో 28 సంవత్సరాల వయసులోనే చనిపోయారు.